ముగ్గురు ప్రముఖ నటులు కమల్ హాసన్, పహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న ‘విక్రమ్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ , శాటీలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లుగా తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ హాట్‌స్టార్ అన్ని భాషల్లో విక్రమ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు స్టార్ టీవీ నెట్‌వర్క్ శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ మొత్తం కలిపి రూ.125 కోట్లకు విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. అదు నిజమైతే సినిమా బడ్జెట్‌లో చాలావారకు ఇక్కడే కవర్ అయిపోతుంది. దీంతో ప్రొడ్యూసర్లకు మంచి లాభం చేకూరుతుంది. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండటం విశేషం.