భారత్‌తో తుది టీ20 పోరుకు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ విలియమ్సన్ నేడు జరిగే మూడో టీ20కి అందుబాటులో ఉండట్లేదు. వైద్య చికిత్స కోసం విలియమ్సన్ ఇదివరకే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో టీ20కి ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ నాయకత్వం వహిస్తాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. విలియమ్సన్ స్థానంలో మరో బ్యాటర్ చాప్మన్ జట్టులోకి రానున్నాడు. కాగా, రెండో టీ20లో విలియమ్సన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా కేన్ క్రీజులో నిలబడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
మూడో టీ20కి కేన్ దూరం

© ANI Photo