డెంగ్యూ బారిన పడిన కంగనా

Courtesy Instagram:

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డెంగ్యూ బారిన పడింది. తెల్లరక్త కణాల సంఖ్య పడిపోయిందని, దీంతో పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె నిర్మాణ సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ తమ ఇన్‌స్టాగ్రమ్‌లో వెల్లడించింది. ఇంతటి జ్వరం, అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమె నటిస్తున్న ‘క్వీన్స్’, ‘ఎమర్జెన్సీ’ సినిమాల పనుల్లో కంగనా పాల్గొంటుందని పేర్కొంది. ఈ మేరకు ఆమె పని చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.

Exit mobile version