నన్ను బాలీవుడ్ భరించలేదు అని సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందించింది. మహేశ్ బాబు అలా చెప్పడంలో తప్పు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇండియలో నంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగుతుంది. మహేశ్ టాలీవుడ్‌లో గత 10-12 ఏళ్ల నుంచి స్టార్‌గా ఉన్నాడు. అందుకే అతడికి వాళ్ల ఇండస్ట్రీపై గౌరవం చూపుతున్నాడు. అతడు అన్న చిన్న మాటను పట్టుకొని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.