ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా కన్నాకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పొసగడం లేదు. ఈ క్రమంలో ఇటీవల జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను కన్నా కలిశారు. ఇక అప్పటి నుంచే ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.