కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటించిన ‘కాంతారా’ సినిమా విడుదలై నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ‘కాంతారా’ మూవీ ఓవరాల్గా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని తెరకెక్కించింది.
-
Courtesy Twitter: Ramesh Bala -
Courtesy Twitter: Ramesh Bala