‘తుంబాడ్’ సినిమా దర్శకుడు ఆనంద్ గాంధీ కాంతార సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘తుంబాడ్’తో కొంతమంది ‘కాంతార’ను పోల్చగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన సినిమాలో పురుషాధిక్యత, సంకుచిత ఆలోచనా ధోరణి వంటి విష సంస్కృతులను ప్రశ్నించేలా చూపించానని కానీ ‘కాంతార’లో వాటిని వేడుకలా గొప్పగా చూపించారని అన్నారు. సినిమాలో శివ, హీరోయిన్ నడుము గిల్లిన మరునాడు ఆమె తండ్రి మాట్లాడే మాటలు ‘ఈవ్ టీజింగ్’ను నార్మల్ అనే చెప్పేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.