కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీకి హాజరైన 50కి పైగా సెలబ్రిటీలు, ఇతరులకు కరోనా సోకిందని సమాచారం. ఇప్పటికే షారుఖ్ ఖాన్, కార్తిక్ ఆర్యన్, విక్కీ కౌశల్, కత్రినాకైఫ్లకు పాజిటివ్ వచ్చింది. మిగతావారికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మే 25న కరణ్ జోహార్ తన 50వ బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి బాలీవుడ్ బడా సెలబ్రిటీలు అమీర్ ఖాన్, షారుఖ్, సల్మాన్, రణ్‌బీర్ కపూర్ వంటి బడా స్టార్స్ అందరూ తళుక్కుమన్నారు. వీరితో పాటు తెలుగు సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రష్మిక, పూజా హెగ్డే , తమన్నా వంటి వాళ్లు కూడా హాజరయ్యారు. దీంతో కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ కరోనాకు హబ్‌గా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుకుండా అంతమందితో పార్టీ నిర్వహించడంపై మండిపడుతున్నారు.