ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాది డైరెక్టర్లకు కథలను ఎంచుకోవడం, వాటిని తెరకెక్కించడంలో ఉన్న నమ్మకం బాలీవుడ్‌లో లోపించిందని అన్నాడు. సౌత్ డైరెక్టర్ ఏం పాయింట్ చేప్పాలనుకుంటున్నారో దాన్ని నేరుగా ప్రేక్షకులకు చెప్పడంలో విజయం సాధిస్తున్నారని అన్నాడు. ఇక బాలీవుడ్ సినిమాల్లో ఒకే కథల్లో చాలా పాయింట్స్‌ను చెప్పాలనుకొని ఫెయిల్ అవుతున్నామని వెల్లడించాడు. నేను కేజీఎఫ్2 చూశాను . చాలా బాగుంది. అదే సినిమాను హిందీలో తెరకెక్కిస్తే మాపై చాలా విమర్శలు వచ్చేవి అన్నాడు. కరణ్ జోహర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.