తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తమను కలుపుకొని పోవడం లేదని కరీంనగర్ సీనియర్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారట. ఈ క్రమంలో బండి వర్గానికి సీనియర్ నేతలకు చిచ్చు రేగింది అది కాస్త రాష్టంలోని అన్ని జిల్లాలకు పాకిందని తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర సీనియర్ నేతలంతా ఓ హోటల్లో చర్చించారని సమాచారం. సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్‌తో చర్చకై బండి సంజయ్, డీకే అరుణ ఇతర నాయకులు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ సీనియర్ నాయకులలో ఉన్న అసంతృప్తిపై చర్చించడంతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలు ఛానళ్లపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.