కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, గత రెండు మూడు రోజుల్లో తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని బసవరాజ్ బొమ్మై సూచించారు. కరోనా బారిన పడటంతో ఆయన దిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. గతనెల 25,26 తారీఖుల్లో బొమ్మై, రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.