మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేరు ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ పలువురి పేర్లు పరిశీలించారని, నియోజకవర్గంలో జరిగిన సర్వేలోనూ కర్నె ప్రభాకర్ కు సానుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్న గులాబీ దళంలో…కేసీఆర్ మదిలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది ఎన్నికల సమయం వచ్చేదాకా తెలియదు.