తమిళ్ స్టార్ హీరో కార్తీ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ‘జపాన్’ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులు పొందింది. కార్తీ కెరీర్లోనే అత్యధిక ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో కార్తీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ ఏ రాజు మురుగన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎస్ఆర్ ప్రభు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.