యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2 ట్రైలర్ ఇటీవల రిలీజైంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచినప్పటికీ కలెక్షన్లు కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాలకు థియేటర్‌కు రావడమే కష్టంగా ఉంది. మరి నిఖిల్ సినిమాకు ఎంతమేకు వస్తారన్నదే డౌటే. మూవీని మొత్తం రూ.30 కోట్లు ఖర్చు పెట్టి పీపుల్ మీడియా సంస్థ తెరకెక్కించింది. నాన్-థియేట్రికల్ రైట్స్ కింద ప్రస్తుతం రూ. 14 కోట్ల రూపాయలు రాబట్టింది. బ్రేక్-ఈవెన్ కావాలంటే మిగిలిన మొత్తం థియేటర్ల నుంచే రావాలి. సినిమా ఎంతో బాగుందని టాక్ వస్తే తప్ప అంత రాబట్టడం కష్టమేనని విశ్లేషకులు చెప్తున్నారు.