హిందీలో 1000 స్క్రీన్లలో ‘కార్తికేయ 2’

నిఖిల్ హీరోగా, అనుపమ హీరోయిన్‌గా నటించిన కార్తికేయ 2 సినిమా హిందీలో మిస్సైల్‌లా దూసుకెళ్లిపోతుంది. బాలీవుడ్ బడా స్టార్ల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసింది. విడుదలైన రోజు కేవలం 50 స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శితమైన ఈ మూవీ 6వ రోజుకు 1000 స్క్రీన్లకు పెరిగింది. సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. దీనిపై మూవీ యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది.

Exit mobile version