కార్వీ సంస్థ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

yousay

మనీ ల్యాండరింగ్ కేసులో కార్వీ సంస్థ ఆస్తులు రూ.110కోట్లను ఈడీ అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తున్న ఈడీ, ఇప్పటివరకు ఆ సంస్థకు చెందిన రూ. 2,093 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. కార్వీ సంస్థ ఎండీ పార్థసారథితో పాటు ఆయన కొడుకుకు చేందిన ఆస్తులను సీజ్ చేసింది. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేసిన వారిని కార్వీ సంస్థ మోసం చేసిందని అభియోగాలు ఉన్నాయి.షేర్ హోల్డర్ల నిధులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని కార్వీ యాజమన్యంపై ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version