బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీలో ఆమె విచారణకు హాజరవుతారు. కాగా విచారణకు రాలేనని కవిత చెప్పినా సీబీఐ ససేమిరా అనడంతో ఆమె ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీ వెళ్లేముందు తన తండ్రి సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ధైర్యంగా సీబీఐ విచారణను ఎదురుకోమని కేసీఆర్ ధైర్యం చెప్పారు.