TS: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగావవిచారణకు హాజరవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పార్టీ నేతలు నైతకంగా మద్దతు ఇస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు అండగా ఉన్నారంటూ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ‘కవితమ్మా.. ధైర్యంగా ఉండండి. కేసిఆర్ కుటుంబసభ్యులమైన మేమంతా మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాం. ఉంటాం. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి. అంతమాత్రాన వేట ఆపుతామా? ధర్మం మీ వైపు ఉంది’ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.