దిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హస్తం ఉన్నట్లు తెలిసింది. నిందితులలో ఒకడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును మూడు చోట్ల ఈడీ చేర్చింది. మంగళవారం రాత్రి అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లు విజయ్నాయర్కు చేరాయని ఈడీ పేర్కొంది. వాంగ్మూలంలో అమిత్ అరోరా కవిత పేరును ధ్రువీకరించారని తెలిపింది. సాక్ష్యాలు దొరకకుండా కవిత వాడిన 10 ఫోన్లను ధ్వంసం చేశారంది. కవితతో పాటు శరత్ రెడ్డి, ఎంపీ మాగుంట సౌత్గ్రూప్ని నియంత్రించారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది.
లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు

Courtesy Twitter:kavita kalvakuntla