బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ అంతా బూటకమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని.. ఇద్దరూ మిత్రులేనని ఆయన విమర్శించారు. కవిత ఈడీ విచారణకు సంబంధించి మీడియా హడావుడి చేస్తోందన్నారు. వాటాల పంపకంలో వచ్చిన తేడాల వల్లే ఈ లిక్కర్ స్కాం బయటపడిందని చెప్పారు. కాగా విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి కేటీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు.