కేసీఆర్‌కు దూరమవుతున్న మై హోం రామేశ్వర్‌రావు?

Courtesy Instagram:Telangana CMO

తెలంగాణ ముఖ్యమంత్రి మై హోం రామేశ్వర్ రావు సన్నిహితులనే విషయం చాలా మందికి తెల్సిందే. కానీ ప్రస్తుతం మాత్రం హై హోమ్ రామేశ్వర్ రావు కేసీఆర్‌తో అంత సఖ్యతగా లేడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా చిన జీయర్ స్వామితో కూడా కేసీఆర్‌కు విభేదాలు వచ్చాయని టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి దగ్గరవడంతోనే కేసీఆర్ వీరిని దూరం పెట్టినట్లు గుసగుసలు వినవస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version