వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్-ఎస్ తరఫున బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రచారం చేస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బీఆర్ఎస్ మంత్రులందరూ కూడా ప్రచారంలో పాలుపంచకుంటారని పేర్కొన్నారు.డబుల్ ఇంజిన్ పాలన చెప్పుకునే బీజేపీ కర్ణాటకలో ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణలో పెన్షన్ రూ.2016 ఇస్తుంటే కర్ణాటకలో రూ.600 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. కర్ణాటక సీఎం కుమరస్వామి కావలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు.