మునుగోడు ఉపఎన్నికల్లో నాయకుల విమర్శనాస్త్రాలు పదునెక్కుతున్నాయి. ఆదివారం చండూరులో సభ నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మునుగోడుకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. చండూరు సభ విజయాన్ని చూసి కేసీఆర్ సోడా లేకుండానే మందు తాగుతాడంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నియామకాలు, నిరుద్యోగ భృతి లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.