దిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్ కుటుంబం!

cmo

బీజేపీ ఎంపీ పర్వేష్ సింగ్‌ కేసీఆర్‌ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ లిక్కర్‌ స్కాంతో కేసీఆర్‌ కుటుంబానికి సంబంధముందని దిల్లీ నేత పర్వేష్ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ కేసులో మంత్రి మనీష్‌ సిసోడియా ఏ1గా ఎఫ్‌ఐఆర్ నమోదైైంది. దిల్లీలో ఎల్‌1 లైసెన్స్‌ హోల్డర్లు లిక్కర్‌ పాలసీ రూపొందించారని, అందులో ఎక్కువ మంది తెలంగాణ నుంచి వచ్చినవారే ఉన్నారని ఎంపీ ఆరోపించారు. తెలంగాణ నుంచి వచ్చినవారు రూ.150 కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఒబెరాయ్‌ హోటల్‌ రూంలో ఎక్సైజ్‌ పాలసీ రూపొందించారని ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు.

Exit mobile version