తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం త్వరలో శుభవార్త అందజేయనున్నట్లు తెలుస్తోంది. స్వయం సహాయక సంఘాలకు త్వరలోనే వడ్డీలేని రుణాలు అందజేస్తామని మంత్రి హరీష్ రావు తెలపడంతో.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అభయ హస్తం నిధులను ఇటీవలే ఎల్ఐసీ.. ప్రభుత్వానికి అందజేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రెండు మూడు నెలల్లో అర్హుదారులకు కొత్త పెన్షన్ అందజేస్తామని మంత్రి హరీష్ తెలిపారు.