ఖమ్మంలో నిర్వహించిన BRS బహిరంగ సభలో పాల్గొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ KCRను పెద్దన్నగా సంబోధించారు. తెలంగాణ కంటివెలుగు కార్యక్రమాన్ని దిల్లీలో అమలు చేస్తామన్నారు. ‘‘ మేం పరస్పరం నేర్చుకుంటాం. దిల్లీ మొహల్లా క్లినిక్లను ఇక్కడ బస్తీ దవాఖానాగా మార్చారు. మోదీ పాలనలో గవర్నర్లను ఆడిస్తున్నారు. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. దేశ గతిని మార్చేందుకు వచ్చే ఎన్నికలు చక్కటి అవకాశం” అని కేజ్రీవాల్ అన్నారు.