తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పక్కా పరస్పర అవగానతోనే ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వారు కేవలం ఓట్ల కోసమే వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతారని, వారి మధ్య అవాగాహన ఉందని ఆరోపించారు. విభజన సమయంలో ఏపీలో కలిపిన గ్రామాలను తాము అధికారంలోకి వస్తే తెలంగాణకు తెస్తామని డీకే అరుణ అన్నారు.