ఏ ఫ్రంటూ పెట్టట్లేదని ప్రకటించిన కేసీఆర్

© File Photo

చాలా రోజుల నుంచి తెలంగాణలో ఇంకా జాతీయ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. కేసీఆర్ కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని. దానికి అనుగుణంగానే ఈ మధ్య కేసీఆర్ చేసే కామెంట్లు కూడా ఉంటున్నాయి. అందువల్ల కేసీఆర్ ఖచ్చితంగా ఢిల్లీ గడప తొక్కుతాడని అంతా అనుకున్నారు. కానీ నిన్నటి ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. తాను ఏ ఫ్రంటూ పెట్టాలని అనుకోవడం లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. కానీ జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ కీ రోల్ పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Not Creating Any Front: KCR Says Party Will Play Key Role In National Politics

Exit mobile version