తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ గురించి ఆసక్తికర విషయం తెలిపాడు. అతను తనకు గత 7-8 ఏళ్ల నుంచి మంచి స్నేహితుడని పేర్కొన్నాడు. ప్రశాంత్ 12 రాష్ట్రాలల్లో ఎన్నికల సమయంలో పని చేసినట్లు చెప్పాడు. అయితే ఓ మీడియా రిపోర్టర్ ప్రశాంత్ కిషోర్ కు కేసీఆర్ రూ.300 కోట్లు ఇచ్చాడా అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన సీఎం అతను జీతం తీసుకునే ఉద్యోగి కాదన్నారు. ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.