తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మద్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని తెలుసుకున్న తమిళి సై… కోలుకోవాలని ఆకాంక్షించారు.