TS: సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు ఇదే చివరి అవకాశం అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. బడ్జెట్లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అతిపెద్ద నాగోబా జాతరను ప్రభుత్వం విస్మరించిందని సంజయ్ ఆరోపించారు. గిరిజనులంటేనే కేసీఆర్కు చులకన అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. కాగా, ఈ నెల 22న కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి బండి సంజయ్ నాగోబా జాతరలో పాల్గొన్నారు.