జనవరి 12 సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మహబూబాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కార్యక్రమం అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు.