TRS పార్టీ కార్యవర్గ సమావేశం ఈనెల 22వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో సీఎం, గులాబీ దళం అధిపతి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జాతీయ పార్టీ గురించి గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండడంతో.. దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించే తీరు గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.