తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. సికింద్రాబాద్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో జెండా ఆవిష్కరించిన గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాష్ట్రప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన తమిళిసై.. రాష్ట్ర అభివృద్ధికి రాజ్‌భవన్ కావాల్సిన సహకారం అందిస్తోందని చెప్పారు.