జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి

Courtesy Twitter: cmo ts

జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టినట్ల తెలుస్తోంది. ఇందులో భాగంగానే రైతు సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ విధానాన్ని దేశానికి పరిచయం చేయాలని భావిస్తున్నారు. ఇందుకో కోసం గుజరాత్‌లో రైతు సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. రైతు సంఘాలు, భావ సారుప్యత ఉన్న పార్టీలను కలుపుకుపోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో ఆయన సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈనెల 3న కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు సమాచారం.

Exit mobile version