బీఆర్ఎస్ పార్టీని ఏపీలో విస్తరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఏపీలో మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరేందుకు సిద్దమయ్యారు. బీఆర్ఎస్- ఏపీ అధ్యక్షుడి బాధ్యతలను ఆయనకు అప్పగించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. చంద్రశేఖర్‌తో పాటు మరికొందరు రిటైర్డ్ అధికారులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. సంక్రాంతి లోపే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.