ముగ్గురు వైద్యులు కలసి ఓ మహిళను అత్యాచారం చేసిన ఘటన యూపీలోని బస్తీలో చోటుచేసుకుంది. ఒక డాక్టర్ తాను బస్తీలో ఆస్పత్రి పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అది నమ్మి ఒక ప్రైవేట్ మహిళా టీచర్ సోషల్ మీడియాలో అతనితో స్నేహం పెంచుకుంది. ఒక రోజు ఆస్పత్రికి రమ్మని ఆమెను వైద్యుడు కోరాడు. నమ్మి వచ్చిన ఆ మహిళను హాస్టల్కు తీసుకెళ్లి, తోటి వైద్యులతో కలసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.