రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్ అవతారమెత్తింది. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రెండు రివాల్వర్లు పట్టుకుని జడ కొప్పు ముడుచుకున్నట్లుగా ఉన్న స్టిల్ ఆకట్టుకుంటుంది. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహానటి, గుడ్‌లఖ్ సఖి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో కీర్తి నటించి మెప్పించింది. ‘రివాల్వర్ రీటా’గా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నానితో కీర్తి జంటగా నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది.