బాలివుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ‘షేర్షా’ చిత్ర షూటింగ్ వేళ ప్రేమలో పడ్డ ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 6న వీరి పెళ్లికి ముహూర్తం కుదిరిందని, ప్రస్తుతం ఈ కపుల్ ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు బాలివుడ్ టాక్. రెండు రోజుల వ్యవధిలో మెహందీ, సంగీత్, పెళ్లి.. ఈ మూడు వేడుకలు జరగనున్నాయట.