కరోనాతో తల్లిదండ్రులు చనిపోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకటి నుంచి ఇంటర్ వరకు ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ప్రవేశాలు కల్పించనున్నారు. సంరక్షుల వద్ద ఉంటున్న పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. కలెక్టర్ ధృవీకరణతో ప్రవేశాలు కల్పిస్తామని కేంద్రీయ విద్యాలయ అధికారులు తెలిపారు.