ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ కు కేరళ థియేటర్ ఓనర్స్ షాక్ ఇచ్చారు. భవిష్యత్తులో ఆయన నటించిన సినిమాలన్నింటినీ నిషేధించాలని నిర్ణయించారు. దుల్కర్ తాజాగా నటించిన సెల్యూట్ సినిమాను ముందుగా థియేటర్లలో కాకుండా సోని లైవ్ ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళతో చేసుకున్న ఒప్పందం ఆయన రద్దు చేసుకున్న కారణంతో థియేటర్ ఓనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ సినిమాలో డయానా పెంటీ హీరోయిన్ గా నటించగా, రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు.