ప‌వ‌ర్ స్టార్ సినిమాలో ‘రొమాంటిక్’ బ్యూటీ

Courtesy Instagram: ketika sharma

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ సినిమాల‌తో బ‌జీగా ఉన్నాడు. ఆ త‌ర్వాత త‌మిళ మూవీ వినోదాయ సితం రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. స‌ముద్ర‌ఖ‌ని దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఆయ‌న‌కు జోడిగా కేతిక శ‌ర్మ‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది. దీంతో కెరీర్ ప్రారంభంలోనే ప‌వ‌ర్‌స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ గ్లామ‌ర్ డాల్. దీని గురించి త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

Exit mobile version