ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరం ప్రారంభ తేదీని కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రామమందిరాన్ని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్రిపుర పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిరం రామజన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. మందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా పలు హిందూ ధార్మిక సంస్థలు పెద్దఎత్తున విరాళాలు అందించాయి.