ఏపీలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓ మహిళకు సంబంధించిన కేసులో కోర్టు తీర్పుతో జీవోలో మార్పు జరిగింది. ‘లిఖితపూర్వక’ అభ్యంతరం నిబంధనను తొలగించాలని ఆదేశించింది. ఈ నిబంధన ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఎవరూ అభ్యంతరం లేవనెత్తకపోతేనే సదరు వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వస్తుంది. ఈ కేసులో మహిళ పెళ్లయిన ఆరు నెలలకే భర్తను కోల్పోయింది. కారుణ్య నియామకం కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించగా… వాళ్ల అత్త.. ఆస్తిపై హక్కు వదులుకుంటేనే సంతకం పెడతానని చెప్పడంతో సర్టఫికెట్ ఆగిపోయింది.