సిినిమా హాళ్లలోకి బయటి ఆహారం తీసుకెళ్లడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం… బయటి ఆహారాన్ని లోపలికి తీసుకురాకుండా నిషేధించే హక్కు థియేటర్ యాజమాన్యానికి ఉంటుందని తేల్చిచెప్పింది. థియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ప్రైవేటు యాజమాన్యం అధీనంలో ఉంటాయి. ప్రజా ప్రయోజనాలకు ఇబ్బంది కలగే నిర్ణయాలు తీసుకోనంత వరకు థియేటర్లకు అన్ని హక్కులు ఉంటాయని సుప్రీం అభిప్రాయపడింది. ఈ విషయంలో గతంలో జమ్ము-కశ్మీర్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం పక్కనబెట్టింది.