కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ తెలుగులోకి డబ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భీకరమైన క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అయితే ఆయన సినిమా ‘భీమ్లా నాయక్’ని మించి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ బిజినెస్ చేయడం విశేషం. పవన్ క్రేజ్ బాగా ఉన్న తూర్పుగోదావరిలో ‘భీమ్లా నాయక్’కు 6.7 కోట్ల రూపాయలు రాగా, KGF 2 కు 7 కోట్ల రూపాయలు వచ్చాయి. ఉత్తరాంధ్రలోనూ ఇదే పరిస్థితి. అక్కడ భీమ్లా నాయక్ కు రూ.9.2 కోట్లు రాగా, KGF 2 రూ.10 కోట్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాపై తెలుగులో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.