రాకింగ్ స్టార్ యష్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ KGF 2. గతనెల 14వ తేదీన విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన నాటి నుండి ఇప్పటికి వరకు రూ.1000 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ మూవీ.. తాజాగా మరో రికార్డు సృష్టించింది. హిందీలో ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. KGF 2 కంటే ముందు బాహుబలి 2 మాత్రమే ఈ ఫీట్‌ను సాధించగా తాజాగా ఈ సెన్సేషనల్ మూవీ ఈ లిస్టులో చేరిపోయింది. దీంతో పాటు హిందీలో ఈ మొత్తంలో వసూలు చేసిన ఏకైక కన్నడ సినిమాగా మరో రికార్డు సాధించింది.