KGF 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మార్చి 27న బెంగుళూర్లో జరగనుంది. ఈ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు చిత్ర నిర్మాతలు. ఈవెంట్‌ను బాలివుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ చేయనున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో బాలివుడ్లో కూడా సినిమాను ప్రమోట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.