పాన్ ఇండియా సినిమా KGF-2 నుంచి తాజాగా విడుదలైన తుఫాన్ సాంగ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన 24గంటల్లో అత్యధికంగా వ్యూస్ పొందిన లిరికల్ వీడియో సాంగ్ రికార్డు సృష్టించింది. మొత్తం ఐదు భాషల్లో 26మిలియన్లకు పైగా వ్యూస్, 2మిలియన్లుకు లైక్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. గతంలో విడుదలైన కేజీఎఫ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో యశ్ హీరోగా నటించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 2022 ఏప్రిల్ 14న ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.