KGF 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్. మార్చి 27 బెంగళూరులో ఈవెంట్ జరగనుంది. ఇతర ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్‌ను ఈవెంట్ హోస్ట్ చేసేందుకు సంప్రదించినట్లు తెలిపారు. కేజీఎఫ్2 ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.